నూతన సంవత్సరాది సందర్భంగా తన మంచి మనసు చాటుకున్న పవన్ అర్ధాంగి
- నారపల్లిలో ఓ అనాథ శరణాలయాన్ని సందర్శించిన అనా కొణిదెల
- అనాథ బాలలతో నూతన సంవత్సర వేడుకలు
- కేక్ కట్ చేసి వారితో ఉత్సాహంగా గడిపిన పవన్ అర్ధాంగి
- ఐదుగురు బాలికల స్కూలు ఫీజు అందించిన వైనం
- అనాథాశ్రమానికి కావాల్సిన సరుకుల అందజేత
హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన అనాథ శరణాలయాన్ని సందర్శించారు. తమకంటూ ఎవరూ లేని అనాథ బాలలతో ముచ్చటించి వారిలో ఆనందం నింపారు. వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. కేక్ కట్ చేసి వారితో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
అంతేకాదు, ఐదుగురు బాలికలకు స్కూలు ఫీజు చెల్లించాల్సి ఉందని తెలుసుకున్న అనా కొణిదెల అందుకు అవసరమైన మొత్తాన్ని అక్కడిక్కడే అందించారు. అనాథ శరణాలయానికి అవసరమైన నిత్యావసరాలను పెద్ద మొత్తంలో సమకూర్చారు. అనాథ బాలలకు అవసరమైన వస్తువులను కూడా అందించారు.