కాలిఫోర్నియాలో ఎగసిపడుతున్న రాకాసి అలలు.. తీరప్రాంతాల మూసివేత
- మూడు రోజులుగా ఇదే తీరు
- భయంతో నివాసాలను ఖాళీ చేస్తున్న స్థానికులు
- కొట్టుకుపోయిన కార్లు.. పలువురికి గాయాలు
అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండడంతో అధికారులు తీర ప్రాంతాలను మూసివేశారు. వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి మరీ అలలు ఎగసిపడుతున్నాయి. గురువారం నుంచి చాలాచోట్ల పరిస్థితి ఇలానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను ప్రభావం కారణంగానే అలలు ఎగసిపడుతున్నట్టు తెలుస్తోంది.