మెక్సికోలో దారుణం: ఉత్సాహంగా జరుగుతున్న పార్టీలో కాల్పులు.. ఆరుగురి మృతి
- ఓ కార్టెల్ సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు
- 26 మందికి తీవ్ర గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
- తప్పించుకున్న సాయుధులు
- డ్రగ్స్ యుద్ధాలకు నెలవుగా మెక్సికో
కాల్పులు జరిపిన నలుగురు సాయుధుల్లో ఒకడు అప్పటికే పార్టీలో ఉన్నట్టు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం సాయుధులు నలుగురు తప్పించుకున్నారని తెలిపారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. మెక్సికో అనగానే డ్రగ్స్ యుద్ధాలు గుర్తొస్తాయి. ఇక్కడ డ్రగ్ ముఠాల మధ్య నిత్యం ఆధిపత్యపోరు జరుగుతూ ఉంటుంది. ఈ పోరులో 2006 నుంచి ఇప్పటి వరకు వేలాదిమంది మరణించారు. ఈ నెల 17న క్రిస్మస్ సీజన్ పార్టీలో జరిగిన దాడిలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. అంతకుముందు 9న గన్మెన్లకు, క్రిమినల్ గ్యాంగ్‌కు మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.