బీజేపీకి ఓటు వేసి మోదీని మరోసారి ప్రధానిని చేస్తామని చెబుతున్నారు: ఈటల రాజేందర్

  • లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని తెలంగాణ ప్రజలు చెబుతున్నారన్న ఈటల
  • బీజేపీపై ఎన్ని కుట్రలు చేసినా ఉత్తర తెలంగాణలో ఏడు సీట్లు గెలిచామన్న బీజేపీ నేత
  • అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 15 శాతం ఓట్లు లభించాయని గుర్తు చేసిన ఈటల
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేస్తామని యావత్ తెలంగాణ చెబుతోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గురువారం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ... బీజేపీపై ఎన్ని కుట్రలు చేసినా ఉత్తర తెలంగాణ ప్రజలు కమలం పార్టీని ఆదరించారన్నారు. బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లలో ఏడు సీట్లు ఉత్తర తెలంగాణలో గెలిచినవేనని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పదిహేను శాతం ఓటింగ్ వచ్చిందని గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని గత ఎన్నికల్లోనే నిరూపితమైందన్నారు.

Etela Rajender
Telangana
BJP
Lok Sabha

More Telugu News