KL Rahul: కేఎల్ రాహుల్ సెంచరీ... తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 245 ఆలౌట్

  • సెంచురియన్ లో తొలి టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • నేడు ఆటకు రెండో రోజు
  • ఓవర్ నైట్ స్కోరుకు 37 పరుగులు జోడించిన టీమిండియా
  • 101 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 
KL Rahul registers fighting century as Team India all out for 245 runs

సెంచురియన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు. కేఎల్ రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 101 పరుగులు చేయడం టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన రాహుల్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

ఇవాళ 208-8 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5, నాండ్రే బర్గర్ 3, మార్కో యన్సెన్ 1, గెరాల్డ్ కోట్జీ 1 వికెట్ తీశారు. 

అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాను టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. సిరాజ్ ధాటికి సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ 5 పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 41 పరుగులు. ఓపెనర్ డీన్ ఎల్గార్ 21, టోనీ డి జోర్జి 12 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

More Telugu News