ఆయేషా మీరా హత్య కేసు.. సీబీఐకి హైకోర్టు నోటీసులు
- సీబీఐ దర్యాఫ్తుపై ఆయేషా తల్లిదండ్రుల పిటిషన్
- ఐదేళ్లు గడిచినా కేసులో పురోగతి లేదని ఆరోపణ
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి కోర్టు ఆదేశాలు
తమ కుమార్తె హత్య కేసును మళ్లీ విచారించాలని 2018 లో ఉమ్మడి హైకోర్టు తీర్పిచ్చిన విషయాన్ని ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా తమ పిటిషన్ లో ప్రస్తావించారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసింది ఎవరో తేల్చాలని అప్పట్లో కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. దర్యాఫ్తును సీబీఐ సాగదీస్తోందని ఆరోపిస్తూ.. దర్యాఫ్తును పూర్తిచేసేందుకు గడువు నిర్ణయించాలని కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ అధికారులకు, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.