కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు
- లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని వెల్లడి
- ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ అన్న మంత్రి
- అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న శ్రీధర్ బాబు
అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని శ్రీధర్ బాబు తెలిపారు. లబ్ధిదారులు ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని వెల్లడించారు. ఆశావహుల డేటా సేకరణ కోసం మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ విషయమై స్పందిస్తూ... ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నవారు మరోసారి దరఖాస్తు చేసుకోవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి.. అర్హులైన నిరుపేదలకు ఇస్తామని తెలిపారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.