రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు
- ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు ఈ-మెయిల్
- దేశంలోనే అతి పెద్ద స్కాం జరిగిందంటూ వెల్లడి
- నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్
- ఆర్బీఐ, పలు అగ్రశ్రేణి బ్యాంకుల్లో బాంబులు పేలతాయని బెదిరింపు
దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. ఈ-మెయిల్ లో పేర్కొన్న అన్ని ప్రదేశాల్లో నిశితంగా తనిఖీలు చేశామని, ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
కాగా, 'ఖిలాఫత్ ఇండియా' అనే పేరు మీద బెదరింపు ఈ-మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. నిర్మలా సీతారామన్, శక్తికాంత దాస్, మరికొందరు కేంద్ర మంత్రులు, బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా రాజీనామా చేయాలని ఆ ఈ-మెయిల్ లో పేర్కొన్నారు.