రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
- జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి
- మెగాస్టార్ కు ఆప్యాయంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి
- ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేవంత్
రేవంత్ ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్ మెంట్ కోరారు. త్వరలోనే మనం కలుద్దామని వారికి రేవంత్ చెప్పారు. ఈలోపే రేవంత్ ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు. మరోవైపు, రేవంత్, చిరంజీవి భేటీ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవడం జరిగిందని రేవంత్ అన్నారు.