Allu Arjun: చిరు సినిమాలో బాలనటుడిగా బన్నీ... ఇప్పటికీ తన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వెల్లడి

Allu Arjun shares interesting fact
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవికి నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో 'విజేత' ఒకటి. 1985లో ఈ చిత్రం విడుదలైంది. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, 'విజేత' చిత్రంలో అల్లు అర్జున్ బాలనటుడిగా కనిపించారు. అందులో శారద కొడుకుగా నటించారు. అల్లు అర్జున్ కెమెరా ముందుకు వచ్చిన తొలి చిత్రం ఇదే. 

ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఫొటో పంచుకున్న అల్లు అర్జున్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఆ సినిమాలో తాను ఓ పాత్ర పోషించానని, కానీ తన తండ్రి అల్లు అరవింద్ ఆ సినిమాకు సంబంధించిన తన పారితోషికం ఇంకా ఇవ్వలేదని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, బన్నీ కమల్ హాసన్ నటించిన 'స్వాతిముత్యం' చిత్రంలోనూ బాలనటుడిగా తళుక్కుమన్నారు.
Go Back to Shorts
Allu Arjun
Vijeta
Allu Aravind
Chiranjeevi
Geetha Arts
Tollywood

More Telugu News