యూట్యూబ్ వీడియో చూసి 11 ఏళ్ల బాలుడి ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూట్యూబ్ వీడియో చూసి 11 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

11 Year Old Dies By Suicide In UP After Watching Ways To Die Video Online
  • ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఘటన
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేస్ టూ డై వీడియో చూసిన విద్యార్థి
  • అనంతరం ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలా చనిపోవాలి అనే వీడియో చూసి ఓ బాలుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హమీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిఖిల్ సాహూ అనే ఆరో తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేస్ టూ డై అనే వీడియో చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడిది ఆత్మహత్య అన్న విషయం పోస్ట్‌మార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. అతడి నిర్ణయం వెనక కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.
Advertisement
Uttar Pradesh
Crime News

More Telugu News