Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త

RTC MD Sajjanar tweet about new buses
Advertisement
  • సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తామన్న సజ్జనార్
  • వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50 బస్సులను ప్రారంభిస్తామని వెల్లడి
  • ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని తీసుకు వస్తున్నట్లు తెలిపిన సజ్జనార్
Advertisement
ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. వాటిలో 50 బస్సులను వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తీసుకు వస్తోందన్నారు. 

హైదరాబాద్‌‌లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను సజ్జనార్ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్‌ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని,  వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 

'ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా  కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఈ కొత్త బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని... గమ్యస్థానాల వివరాల కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌) ఉందన్నారు.
Advertisement
Advertisement
sajjanar
Telangana
tsrtc

More Telugu News