Nara Lokesh: నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతినివ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్

AP CID files petition to arrest Nara Lokesh
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ యువనేత నారా లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు తమకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ లో మీ పేర్లు రాశానని చెపుతూ పోలీసు విచారణ అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని పిటషన్ లో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేసుల్లో ఉన్న దర్యాప్తు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని సీఐడీ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. 

దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా? అని సీఐడీ లాయర్ ను కోర్టు ప్రశ్నించింది. దీంతో, పేపర్ కటింగ్ లను కోర్టుకు ఆయన చూపించారు. ఐఆర్ఆర్ కేసులో 41ఏ కింద లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని... అయితే, కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరారు. రెడ్ బుక్ పేరుతో చేస్తున్న హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలని విన్నవించారు. 
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Inner Ring Road Case
AP CID

More Telugu News