Fire Accident: పంజాగుట్టలో అగ్నిప్రమాదం.. షాపింగ్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు

  • ఎర్రమంజిల్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం
  • మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • భవనంలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తెచ్చిన వైనం
Fire accident in a shopping complex in Punjagutta Hyderabad

పంజాగుట్ట ఎర్రమంజిల్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఎర్రమంజిల్‌లోని ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలిస్తున్నారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియరాలేదు.

More Telugu News