ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు సరిగ్గా అమలు కావడం లేదు: గల్లా జయదేవ్
- ఓటర్ల జాబితాను రూపొందించే విషయంలో అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న టీడీపీ ఎంపీ
- ఈసీ ఆదేశాలను డీఆర్వోలు, స్థానిక సిబ్బంది పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపాటు
- కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో గళమెత్తిన టీడీపీ నేత
కాగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష టీడీపీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల పేర్లను తొలగిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే.