Corona Virus: కొవిడ్‌తో అంతగా భయం లేదు కానీ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి: ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్

  • కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన అవసరం లేదన్న సూపరింటెండెంట్
  • బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు జెన్.1 సోకే అవకాశాలు ఎక్కువ అని స్పష్టీకరణ
  • కొవిడ్ రూపాంతరం చెంది జెన్.1గా మారిందని వెల్లడి
Fever Hospital superintendent on Covid

హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు. అయితే ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు కొవిడ్ జెన్.1 వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా వున్నాయని తెలిపారు. కొవిడ్ రూపాంతరం చెంది జెన్.1గా మారిందని, ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు.

నిన్న బుధవారం ఫీవర్ ఆసుపత్రికి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే అది జెన్.1 అవునా? కాదా? అనే విషయమై తేలాల్సి ఉందని, ఈ నివేదికలను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. జెన్.1 ఎక్కువగా వ్యాప్తి చెందితే ఉస్మానియా, నీలోఫర్, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.

More Telugu News