వంద రోజులు వేచి చూస్తాం... మేం రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దు: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గంగుల హెచ్చరిక
- ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే నిరసన తప్పదన్న గంగుల
- వరుసగా తనను నాలుగుసార్లు గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని వ్యాఖ్య
- పోరాటాలు బీఆర్ఎస్‌కు కొత్త కాదన్న మాజీ మంత్రి
వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి.. వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలని.. జవాబుదారీగా పని చేయాలని.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని తెలిపారు. పోరాటాలు బీఆర్ఎస్‌కు కొత్త కాదని... తాము రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దని సూచించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.