అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిగిన దాడి కేసులో ఆ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు
- అక్టోబరు 2023లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి
- మందుపాతర పేల్చిన పీపుల్స్‌వార్ గ్రూప్
- తీవ్రగాయాలతో బయటపడిన చంద్రబాబు
- నిర్దోషులుగా బయటపడిన జి.రామమోహన్‌రెడ్డి, ఎస్.నరసింహారెడ్డి, కేశవ
ఇదే కేసులో గతంలో కడప జిల్లాకు చెందిన ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డి, జోతెం నాగార్జున, కొల్లం గంగిరెడ్డి, ఎన్.పాండురంగారెడ్డికి కింది కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును వారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత కేసు తిరుపతిలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలీ అయింది. విచారణ అనంతరం 2012లో గంగిరెడ్డి, పాండురంగారెడ్డి నిర్దోషులుగా విడుదల కాగా, రామస్వామిరెడ్డి, నాగార్జునపై రివిజన్ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది.