లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్య
- లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
- ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీకి సూచన
- మూడోసారి మోదీ ప్రభుత్వం వస్తోందని ధీమా
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సమానంగా పోరాటం ఉంటుందన్నారు. లోక్ సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని... లోక్ సభ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలన్నారు. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకువెళతామన్నారు. కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కిషన్రెడ్డి పేర్కొన్నారు.