లోక్ సభ స్పీకర్‌కు రాజీనామాను సమర్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తొలుత భార్యతో కలిసి సోనియా, రాహుల్ గాంధీని కలిసిన ఉత్తమ్
- ఓంబిర్లాకు రాజీనామాను సమర్పించినట్లు ట్వీట్ చేసిన మంత్రి
'నేను పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామాను సమర్పించాను' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచి, రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు.