లోక్ సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. వీడియో ఇదిగో

  • లోక్ సభ గ్యాలరీ నుంచి దూకి కలకలం రేపిన దుండగులు
  • భయంతో పరుగులు తీసిన ఎంపీలు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ దుండగుల నినాదాలు
పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు సభలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సభలో నినాదాలు చేస్తూ టియర్ గ్యాస్ ను వదిలారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ వీరిద్దరూ విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు. ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఎంపీలు బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు దుండగులను పట్టుకుని చితకబాదారు. వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా సభలోని బెంచ్ లపై నుంచి దూకుతూ వచ్చి ఒక దుండగుడి వీపుపై పిడిగుద్దులు గుద్దారు. 

ఈ ఘటనపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ... గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్లే దుండగులు సులభంగా సభలోకి ప్రవేశించారని చెప్పారు. సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలని సూచించారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని చెప్పారు. స్పీకర్ ఛైర్ వైపు దూసుకొచ్చిన దుండగుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని... తాను ఎదురుగా వెళ్లి పట్టుకున్నానని... పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశాడని తెలిపారు.

Gorantla Madhav
Parliament

More Telugu News