గుడ్ మార్నింగ్ కోరుట్ల.. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Korutla MLA started Good Morning Korutla Program
  • ప్రజల సమస్యలను తెలుసుకొని... వాటిని పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రారంభించినట్లు వెల్లడి
  • మల్లాపూర్ మండలంలో కార్యక్రమం ప్రారంభించన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
  • ప్రతి రోజు ఉదయం ఓ గ్రామానికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని వెల్లడి
ప్రజల సమస్యలను తెలుసుకొని... వాటిని పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'గుడ్ మార్నింగ్ కోరుట్ల' పేరుతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. బుధవారం ఆయన మల్లాపూర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడ్ మార్నింగ్ కోరుట్ల కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని, రోజుకో గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. 

ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ... ప్రతిరోజు ఉదయం ఓ గ్రామానికి వెళ్లి.. గ్రామంలోని, ప్రతి వార్డులోని సమస్యను తెలుసుకుంటానని చెప్పారు. ఇందులో భాగంగా మల్లాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించానని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు ఏవైనా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంతో ప్రజలు ఆనందిస్తున్నారన్నారు. మనం ఓట్ల కోసం ఎలాగైతే ప్రజల వద్దకు వెళ్లామో.. అలాగే ప్రజా సమస్యలను తీర్చడానికి వారి వద్దకు వెళ్తే బాగుంటుందని భావించానన్నారు.
Go Back to Shorts
kalvakuntla Sanjay
Telangana
BRS
korutla

More Telugu News