ఆసుపత్రిలోకి వచ్చి రోగులను బెంబేలెత్తించిన చిరుత.. వీడియో ఇదిగో!

Leopard Enters into hospital premises
  • మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఘటన
  • ఆసుపత్రిలో ఓ మూలన నక్కిన చిరుతను చాకచక్యంగా బందీ చేసిన ఆసుపత్రి సిబ్బంది
  • చిరుతను చూసి భయభ్రాంతులకు గురైన రోగులు, సిబ్బంది
ఇటీవలి కాలంలో చిరుతలు, పులులు సమీపంలోని పల్లెలు, పట్టణాల్లోకి రావడం పరిపాటిగా మారింది. తాజాగా ఓ ఆసుపత్రి ఆవరణలోకి వచ్చిన ఓ చిరుత అక్కడి రోగులు, ఆసుపత్రి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది. 

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షహాదా ప్రాంతంలోని ఆదిత్య ప్రసూతి, కంటి ఆసుపత్రికి వచ్చిన ఓ కార్మికుడు చిరుతను చూసి భయంతో కేకలు వేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ అరుపులకు చిరుత ఓ మూలన నక్కింది. చిరుతకు సంబంధించిన సమాచారాన్ని కార్మికుడు ఆసుపత్రి సిబ్బందికి తెలిపాడు. వారొచ్చి చిరుత వెనకున్న తలుపులను నిశ్శబ్దంగా మూసివేసి దానిని బందీని చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతను బంధించి తీసుకెళ్లారు.
Go Back to Shorts
Leopard
Maharashtra
Gandhi Hospital

More Telugu News