టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా

TSPSC member satyanarayana resins
  • తాను ఎలాంటి తప్పు చేయకపోయినా సభ్యుడిగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
  • ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తాను బాధ్య‌త నిర్వ‌ర్తించే వాతావ‌ర‌ణం లేదని వ్యాఖ్య
  • విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా తాను నిరుద్యోగుల ప‌క్ష‌మేనన్న సత్యనారాయణ
టీఎస్‌పీఎస్సీ స‌భ్యుడు స‌త్యనారాయ‌ణ మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఎలాంటి త‌ప్పు చేయలేదన్నారు. అయినప్పటికీ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తాను బాధ్య‌త నిర్వ‌ర్తించే వాతావ‌ర‌ణం లేదని పేర్కొన్నారు. కొత్త క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలోనే నియామ‌కాలు జ‌ర‌గాల‌న్న ఉద్యోగార్థుల ఆకాంక్ష‌ల‌ను గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పుడే కాదు.. త‌న విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా తాను నిరుద్యోగుల ప‌క్ష‌మేనని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా నిరుద్యోగులతోనే ఉంటానన్నారు. మీ అంద‌రి ఆశ‌లు, ఆకాంక్ష‌లు వీలైనంత త్వ‌ర‌గా నెర‌వేరాల‌ని కోరుకుంటున్నాన‌ని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
Advertisement
tspsc
Telangana
Congress
BRS

More Telugu News