లోకల్ ట్రైన్ లో రీల్స్ చేస్తున్న యువతితో కానిస్టేబుల్ డ్యాన్స్... వీడియో వైరల్
- ముంబయి లోకల్ ట్రైన్లో యువతి డ్యాన్స్
- పొరబాటున కానిస్టేబుల్ కు తగిలిన యువతి
- ఏమనకుండా తాను కూడా డ్యాన్స్ చేసిన పోలీసు
- వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన
తన పాటికి తాను డ్యాన్స్ చేస్తున్న యువతి... రైల్లో నిలబడి ఉన్న కానిస్టేబుల్ కు పొరబాటున తగలడంతో, ఆయన ఏమంటాడో అనుకుని యువతి డ్యాన్స్ ఆపేయడం.. ఆయన టేకిటీజీ పాలసీలో స్పందించి... "డోర్ వద్దకు వెళ్దొద్దు... పడతావు జాగ్రత్త" అంటూ చెప్పడం... అనంతరం ఆమెతో కలిసి తాను కూడా డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు.
ఓ మరాఠీ గీతానికి వారు డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.