సీబీఐకి మరింత పవర్ కట్టబెట్టాలి: పార్లమెంటరీ ప్యానెల్
- కేంద్రానికి నివేదిక సమర్పించిన ప్యానెల్
- కేసుల దర్యాఫ్తులో రాష్ట్రాల అనుమతి క్లాజ్ ను తీసేయాలి
- తొమ్మిది రాష్ట్రాలు అనుమతి ఉపసంహరించుకున్నాయని వెల్లడి
కేసుల దర్యాఫ్తులో రాష్ట్రాల జోక్యాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ ప్యానెల్ సూచించింది. రాష్ట్రాల అనుమతితో సంబంధం లేకుండా ఏ కేసునైనా విచారించే అధికారం కల్పించాలని ప్యానెల్ సభ్యులు చెప్పారు. సీబీఐకి ఇప్పటికే అనుమతినిచ్చిన రాష్ట్రాలు కూడా తమ అనుమతిని ఉపసంహరించుకుంటున్నాయని గుర్తుచేశారు. తొమ్మిది రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. దీంతో కొన్ని కీలక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సీబీఐకి సహకారం అందడంలేదన్నారు. ఫలితంగా కేసుల దర్యాఫ్తు ముందుకు సాగడంలేదన్నారు.