శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!
- తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలింపు
- క్యూలైన్ లో భద్రతా సిబ్బందికి, భక్తులకు మధ్య వివాదం
- ఘర్షణ తలెత్తడంతో భద్రతా సిబ్బంది దాడి
భద్రతా సిబ్బంది దాడిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ భక్తులు క్యూలైన్ లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామి వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో.. భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.