పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదిగో!

  • తన తండ్రి పెద్ద అబద్ధాలకోరు అన్న సీరత్ కౌర్
  • తన తల్లిని ఎమోషనల్‌గా బలహీనపర్చారని ఆరోపణ
  • విధానసభకు, గురుద్వారాకు మద్యం మత్తులో వెళ్తారన్న సీరత్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై కుమార్తె సీరత్ కౌర్ సంచలన వ్యాఖ్యలతో కూడిన వీడియోను విడుదల చేశారు. తన తండ్రిని పెద్ద అబద్ధాలకోరుగా ఆమె అభివర్ణించారు. తన తండ్రి మొదటి నుంచీ అబద్ధాలతోనే కాలక్షేపం చేస్తున్నారని, తన తల్లిని ఎమోషనల్‌గా బలహీనపరిచినట్టే పంజాబ్ ప్రజలనూ బలహీనపరుస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 

విధానసభకు, గురుద్వారాకు మద్యం మత్తులోనే వెళ్తున్నారని ఆరోపించారు. సొంత పిల్లలకే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ వీడియోను సీరత్‌కౌర్ తల్లి, భగవంత్‌మాన్ మొదటి భార్య ఇందర్‌ప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Bhagwant Mann
Seerat Kaur
Punjab

More Telugu News