కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌దిగా చెబుతున్న రూ. 300 కోట్లు స్వాధీనం.. తమకు సంబంధం లేదన్న జైరాం రమేశ్
- ఒడిశాలోని బౌధ్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో ఐటీ సోదాలు
- దాదాపు రూ. 300 కోట్ల నగదు స్వాధీనం
- ధీరజ్ సాహు వ్యాపారాలతో పార్టీకి సంబంధం లేదన్న జైరాం రమేశ్
- ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి వారికే ఇస్తామన్న మోదీ
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన ప్రాంతాల్లో పెద్దమొత్తంలో నగదు లభ్యం కావడంపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ధీరజ్ అవినీతిలో భాగం కావడం ఇదే తొలిసారి కాదని విమర్శించారు. కుంభకోణం ఎక్కడ జరిగితే అక్కడ కాంగ్రెస్ నేత ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఎక్స్ ద్వారా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రజల నుంచి దోచుకున్న ఈ సొమ్మును తిరిగి వారికే ఇచ్చేస్తామని పేర్కొన్నారు.