అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫొటోలను విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు
Add ap7am to your home Screen

అయోధ్య రామ మందిరం గర్భగుడి ఫొటోలను విడుదల చేసిన తీర్థ క్షేత్ర ట్రస్టు

Sri Ram Janmabhumi Theertha Kshetra Trust releases Ayodhya Ram Mandir sanctum images
  • అయోధ్యలో రామాలయ నిర్మాణం
  • తుదిమెరుగులు దిద్దుకుంటున్న మందిరం
  • జనవరిలో ప్రారంభం
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేడు విడుదల చేసింది. మరో నెల రోజుల్లో ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

కాగా, జనవరిలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు  ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 16 నుంచి ఈ క్రతువు చేపట్టనున్నారు. జనవరి 22న  మూల విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతేకాదు, 130 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
Advertisement
Ayodhya Ram Mandir
Sanctum
Sri Ram Janmabhumi Theertha Kshetra Trust
India

More Telugu News