Revanth Reddy: లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy resigns for Lok Sabha
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్ సభ సభాపతి ఓం బిర్లాతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సభాపతితో సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు. సభాపతికి రాజీనామాను సమర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపు, మరో ఆరుగురు కేబినెట్ ఎంపికపై చర్చించేందుకు రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Assembly Results
Lok Sabha Speaker

More Telugu News