రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం... సచివాలయంలో ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ ఇదే..!

Telangana cabinet meet today
  • కొలువుదీరిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
  • రేవంత్ ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం 
  • సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ ముఖ్యమంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర కొత్త కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సచివాలయంలో రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నేమ్ ఫోటోను ట్వీట్ చేసింది.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana Assembly Results

More Telugu News