ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు దేనిపై చేశారంటే...!
- తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం
- సీఎంగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం
- దివ్యాంగురాలు రజని నియామక పత్రంపై రెండో సంతకం
మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.
గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
రైతు భరోసా - రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్.
యువ వికాసం - ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు.
చేయూత - రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.
ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.