కేసీఆర్ ఇక రిటైర్ అయితే బెటర్: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
- గజ్వేల్ లో తాను ప్రచారం చేస్తే కేసీఆర్ ఓడిపోయేవాడని వ్యాఖ్య
- కేబినెట్ విస్తరణలో తనకూ అవకాశం వస్తుందని రాజగోపాల్ రెడ్డి ధీమా
- భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి అభినందించిన సీనియర్ నేత
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించాలని తాను ఆశించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంత్రివర్గంలో ప్రస్తుతం చోటు దక్కకపోయినా సెకండ్ ఫేజ్ (మంత్రివర్గ విస్తరణ) లో తనకు తప్పకుండా చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పదవి చేపడితే ప్రజలకు మరింత సేవ చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని దేశం మొత్తానికీ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.