Irfan pathan: ఆ బౌలర్‌ను తీసుకోండి.. చెన్నై సూపర్‌కింగ్స్‌కి ఇర్ఫాన్ పఠాన్ సలహా

  • బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్‌ను తీసుకోవాలని సూచన
  • నంబర్ 3లో అంబటి రాయుడి స్థానంలో మంచి బ్యాట్స్‌మెన్ అవసరమన్న మాజీ ఆటగాడు
  • ముంబై వేదికగా డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం
Irfan pathan suggestion for  CSK In IPL 2024 Auction

ఐపీఎల్ 2024 మినీ వేలానికి సమయం దగ్గర పడుతుండడంతో ఏయే ఆటగాళ్లను ఏ జట్లు దక్కించుకోబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. ఎంత ధర వెచ్చించబోతున్నాయనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆటగాళ్ల ఎంపికపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కీలకమైన సలహా ఇచ్చాడు. 

చెన్నై సూపర్ కింగ్స్‌కి దీపక్ చాహర్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా గాయాలపాలవ్వడం జట్టుకు ఇబ్బందికరంగా మారిందని, ఈ జట్టుకి హర్షల్ పటేల్ లాంటి పేసర్ అవసరమని పఠాన్ సూచించాడు. ఐపీఎల్ మినీ వేలంలో అతడిని కొనుగోలు చేయాలని సలహా ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లు ఫిట్‌గా లేకున్నా, అందుబాటులో లేకున్నా చెన్నైకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రస్తావించాడు. బెంగుళూరు, చెన్నై మధ్య పెద్ద దూరం లేదని, ఐదు గంటల చిన్నపాటి ప్రయాణం చేసి హర్షల్ పటేల్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌లో చేర్చుకోండంటూ పేర్కొన్నాడు. పేసర్ హర్షల్ పటేల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేయాలని అన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ పఠాన్ పేర్కొన్నాదు. అజింక్యా రహానేపైనే పూర్తిగా ఆధారపడలేరు కాబట్టి టాప్ ఆర్డర్‌లో మంచి బ్యాటర్ అవసరమని పేర్కొన్నాడు.

గతేడాది అజింక్య రహానే బాగానే ఆడాడని, కానీ స్లో పిచ్‌ల విషయంలో ఇబ్బంది పడతాడని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వారు అతని కోసం బ్యాకప్‌ను కూడా కలిగి ఉండాలని కోరుకుంటారు. ఎంఎస్ ధోనీ తను శిఖరాగ్రంలో లేడని మీరు అర్థం చేసుకోవాలి. అతను క్రమం తప్పకుండా నంబర్ 8 వద్ద బ్యాటింగ్ చేసేవాడు" అని ఇర్ఫాన్ అన్నాడు. ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేయాలని అందరూ కోరుకుంటారని, కానీ అతడు చేయలేడని, ధోనీ యువకుడు కాదని గుర్తించాలన్నాడు. నంబర్ 3లో అంబటి రాయుడి స్థానంలో మరో మంచి బ్యాట్స్‌మెన్ అవసరమని పేర్కొన్నాడు. 

కాగా రూ.32.1 కోట్ల భారీ మొత్తంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొననుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌, సిసంద మగల, డ్వైన్ ప్రిటోరియస్ వంటి కీలకమైన ఆటగాళ్లను జట్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 19న ముంబైలో జరగనుంది.

More Telugu News