ప్రమాణస్వీకారం చేయకుండా అధికారిక కాన్వాయ్ వద్దన్న రేవంత్ రెడ్డి
- బుధవారం రాత్రి బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న కాన్వాయ్‌ని నిరాకరించిన సీఎల్పీ నేత
- సొంత వాహనంలో మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి ఎల్లా హోటల్‌కు వెళ్లిన రేవంత్
- భద్రతా కారణాలరీత్యా వాహనాన్ని అనుసరించిన అధికారులు
కాగా బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి అక్కడి నుంచి నేరుగా గబ్బిబౌలిలోని ఎల్లా హోటల్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ప్రమాణస్వీకారానికి సంబంధించిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.