మహిళ ఆత్మహత్య.. ‘పుష్ప’ యాక్టర్ అరెస్ట్
- ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండగా ఫొటోలు తీసిన జగదీశ్
- ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు
- వేధింపులు తాళలేక గత నెల 29న బాధితురాలి ఆత్మహత్య
- పరారీలో ఉన్న నిందితుడిని బుధవారం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు
పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న మహిళ.. జగదీశ్ వేధింపుల నేపథ్యంలో గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. గత నెల 27న బాధిత మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగడంతో తీవ్ర ఆవేదనకు లోనైన బాధితురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగదీశ్‌ను నేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, మృతురాలితో జగదీశ్‌కు గతంలో పరిచయం ఉండేదని పోలీసులు తెలిపారు.