Abhiram Daggubati: నేడు శ్రీలంకలో దగ్గుబాటి అభిరామ్ వివాహం

Abhiram daggubati to tie knot today in Srilanka
షార్ట్స్‌లో చూడండి
సినీ నిర్మాత సురేశ్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ వివాహం మరికాసేపట్లో జరగనుంది. ఈ రోజు రాత్రి 8.50 గంటలకు శ్రీలంకలోని కలుతర పట్టణంలో వివాహ వేడుక నిర్వహించనున్నారు. తనకు వరుసకు మరదలయ్యే ప్రత్యూష చాపరాలను ఆయన పెళ్లాడనున్నారు. సముద్రం మధ్యలో ఉండే కలుతర రిసార్ట్స్‌లో పెళ్లి వేడుక ఏర్పాటు చేశారు. 

అభిరామ్‌కు వరుసకు మరదలయ్యే ప్రత్యూష.. అతడి చినతాత కూతురికి కూతురు. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగింది. హల్దీ, మెహందీ కార్యక్రమాలను నగరంలోనే నిర్వహించారు. 

కాగా, పెళ్లి తరువాత ఇరు కుటుంబాల వారు రేపు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని సమాచారం.
Go Back to Shorts
Abhiram Daggubati
Rana Daggubati
Tollywood

More Telugu News