కీలక మలుపు... ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు
- హోటల్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి
- నిన్నటి నుంచి హైదరాబాద్ హోటల్లోనే ఉన్న రేవంత్ రెడ్డి
- కాసేపట్లో సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేసీ వేణుగోపాల్
ఓ వైపు సీఎం పదవి కోసం మల్లు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఇలాంటి సమయంలో రేవంత్ కు పిలుపు రావడం కీలక అంశంగా మారింది. మరోవైపు కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థిపై ప్రకటన చేసే అవకాశముంది.