గజ్వేల్ ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న కేసీఆర్.. ఎవరు అందించారంటే..!
- గజ్వేల్ గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి
- పక్కనే ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
- సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసిన బీఆర్ఎస్ వర్గాలు
అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఎమ్మెల్యేలుగా గెలిచినవారందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో హుందాగా పక్కకు తప్పుకున్నామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని అన్నారు. కాంగ్రెస్ సర్కారులో ఏం జరుగుతుందో చూద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉందని ప్రస్తావించారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.