మూడు రాష్ట్రాల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ షాక్?
- బుధవారం జరగనున్న ఇండియా కూటమి సమన్వయ సమావేశానికి డుమ్మా!
- సమావేశం గురించి తెలియదంటున్న తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు
- కీలక రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓటమి నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన పరిణామం
ఇదిలావుంచితే.. ఇండియా కూటమి పార్టీలతో సీట్ల భాగస్వామ్యం లేకపోవడం కారణంగానే కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లలో ఓడిపోయిందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోరాడాలనే కాంగ్రెస్ నిర్ణయం ఓట్లు చీలడానికి కారణమైందని ఆమె విశ్లేషించారు. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ భారీ విజయాలు సాధించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట ఇచ్చేదిగా ఉంది.