Bigg Boss: సార్ .. మాకు ఎలాంటి ఆస్తులూ లేవు: 'బిగ్ బాస్' ప్రియాంక

Bigg Boss 7 Update
షార్ట్స్‌లో చూడండి
బయటి నుంచి చూసేవారికి బిగ్ బాస్ హౌస్ అందమైన భవనంలా కనిపిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని అనిపిస్తుంది. కానీ అందరికీ దూరంగా .. ప్రపంచాన్ని మన గుప్పెట్లో ఉంచే సెల్ ఫోన్ కి దూరంగా ఉండటం చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా ఒక రేంజ్ లో గొడవపెట్టుకుని మళ్లీ అదే ఇంట్లో కలిసి ఉండటం మరింత కష్టమైన విషయం. 

అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా దూసుకుపోతూ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం టాప్ 5 సభ్యుల లిస్టులో ఆమె పేరు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేస్తారనే ప్రశ్నకి ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది. 

"సార్ .. మా ఫాదర్ కి ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఇల్లుగానీ .. షాప్ గాని లేదు. అటు అమ్మపేరు మీద గానీ .. ఇటు నాన్నపేరు మీద గాని ఎలాంటి ఆస్తులు లేవు గనుక, ఒక ఇల్లు తీసుకుని వాళ్లకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను" అంటూ నిజాయతీగా సమాధానమిచ్చింది. మరి ఈ సీజన్లో ఆ ప్రైజ్ మనీని ఎవరు అందుకుంటారనేది చూడాలి. 
Go Back to Shorts
Bigg Boss
Priyanka
Amar
Shivaji
Shobha

More Telugu News