Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడో రౌండ్ అనంతరం బర్రెలక్క పరిస్థితి ఇలా ఉంది!

Barrelakka got 983 votes after 3 rounds counting
Advertisement
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బర్రెలక్క
  • కొల్లాపూర్ నుంచి బరిలో దిగిన వైనం
  • మూడు రౌండ్ల అనంతరం బర్రెలక్కకు లభించిన ఓట్లు 983
  • కొల్లాపూర్ లో లీడింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు
Advertisement
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నేతలతో పాటు అత్యధికంగా వినిపించిన పేరు బర్రెలక్క. ఆమె అసలు పేరు కర్నె శిరీష. ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నానంటూ ఆమె చేసిన ఓ వీడియోతో పాప్యులారిటీ రావడమే కాదు, బర్రెలక్క అనే పేరు లభించింది. 

బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజ వేసిన ఈ యువతి... ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వచ్చేసరికి డీలాపడిపోయింది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం కేవలం 983 ఓట్లు మాత్రమే పొందింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Advertisement
Advertisement
Barrelakka
Votes
Counting
Independent
Kollapur

More Telugu News