Advertisement

గెట్ రెడీ టు సెలబ్రేట్ గైస్ అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన కేటీఆర్

Get Ready To Celebrate Guys KTR X With Photo
  • లెక్కింపునకు ముందు ఎక్స్ ద్వారా శ్రేణుల్లో ధైర్యం నింపిన కేటీఆర్
  • హ్యాట్రిక్ 3.0 లోడింగ్ అంటూ గన్ గురిపెట్టిన ఫొటో షేర్ చేసిన మంత్రి
  • తొలి నుంచి ఫలితాలపై ధీమాగా ఉన్న బీఆర్ఎస్ నేత
మరో గంటలో ఈవీఎంలు తెరుచుకోనున్నాయి. ఈ ఘడియ కోసం తెలంగాణ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షంగా కాంగ్రెస్‌కే అధికారం కట్టబెట్టినా, అధికార బీఆర్ఎస్ మాత్రం గెలుపు తమదేనని, హ్యాట్రిక్ పక్కా అని ధీమాగా ఉంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా తొలి నుంచి ఇదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయని, ఈసారి కూడా అదే జరుగుతుందని చెబుతూ వస్తున్నారు.

తాజాగా, ఆయన ఎక్స్ వేదికగా మరోమారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. చేతిలో గన్‌ను గురిపెడుతున్నట్టున్న ఫొటోను షేర్ చేస్తూ హ్యాట్రిక్ మనదేనని, విజయోత్సవాలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచిస్తూ.. ‘హాట్రిక్ లోడింగ్ 3.0 గెట్ రెడీ టు సెలబ్రేట్ గైస్’ అని రాసుకొచ్చారు. కేటీఆర్ అంత ధీమాగా చెబుతుండడం పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపింది.
Advertisement
KTR
BRS
Telangana Assembly Election
Vote Counting

More Telugu News