చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ.. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు దూరం!
- గాయం మైదానంలో అయింది కాకపోవచ్చంటున్న బీసీసీఐ వర్గాలు
- కన్సల్టేషన్ కోసం ముంబైలో వాలిపోయిన షమీ
- అనంతరం పునరావాసం కోసం బెంగళూరుకు
సౌతాఫ్రికాతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం షమీని సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, బాక్సింగ్ డే టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో షమీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. కేవలం 7 మ్యాచుల్లోనే 10.70 సగటుతో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి పలు రికార్డులు కొల్లగొట్టాడు.