Hidden Camera: ప్రియుడు చెప్పాడని యువతి దురాగతం.. లేడీస్ బాత్రూంలో రహస్య కెమెరా ఏర్పాటు
![woman puts hidden camera in ladies bathroom on instruction from her lover](https://imgb.ap7am.com/thumbnail/cr-20231201tn65695f3930d85.jpg)
- చండీఘడ్‌లోని లేడీస్ హాస్టల్లో వెలుగు చూసిన ఘటన
- ఎవరికీ అనుమానం రాకుండా యువతుల వీడియోల చిత్రీకరణ
- ఓ యువతి కంట రహస్య కెమెరా పడటంతో నిందితుల బండారం బట్టబయలు
- పోలీసుల అదుపులో నిందితులు
చండీఘడ్‌కు చెందిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టల్లోని బాత్రూంలో వెబ్ కెమెరాను అమర్చింది. రహస్య కెమెరా ద్వారా యువతుల వీడియోలను వారు రికార్డు చేసేవారు. అయితే, ఈ కెమెరాను ఓ యువతి గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెబ్ కెమెరా అమర్చిన యువతి, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న కెమెరా, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.