Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ20 వరల్డ్ కప్ లో 20వ జట్టు ఇదే!

Uganda qualifies for ICC T20 World Cup
Advertisement
  • వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా దేశాల్లో టీ20 వరల్డ్ కప్
  • ఏకంగా 20 జట్లతో మెగా టోర్నీ
  • 8 చిన్న జట్లకు అవకాశం
  • చివరి జట్టుగా క్వాలిఫై అయిన ఉగాండా
  • ఓ ఐసీసీ టోర్నీలో ఆడనుండడం ఉగాండాకు ఇదే ప్రథమం
Advertisement
వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ దీవులు ఆతిథ్యమిస్తున్నాయి. ఈసారి టోర్నీలో మునుపెన్నడూ లేనంతగా 20 జట్లు బరిలో దిగుతున్నాయి. ఐసీసీ కొన్ని చిన్న జట్లకు కూడా ఈ మెగా ఈవెంట్ లో ఆడే అవకాశం కల్పించింది. ఈ జట్లకు క్వాలిఫయింగ్ పోటీలు నిర్వహించి, మెరుగైన జట్లకు బెర్తులు ఖరారు చేసింది. 

ఈ కోవలో ఇప్పటికే ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా అర్హత సాధించగా... చిట్టచివరి జట్టుగా ఆఫ్రికా దేశం ఉగాండా కూడా టీ20 వరల్డ్ కప్ కు అర్హత పొందింది. ఈ వరల్డ్ కప్ లో 20వ జట్టు ఉగాండానే. 

అర్హత పోటీల్లో ఆ జట్టు మొత్తం 6 మ్యాచ్ లు ఆడి 5 విజయాలు నమోదు చేయడం విశేషం. ఉగాండా ఓ ఐసీసీ టోర్నీకి క్వాలిఫై కావడం ఇదే మొదటిసారి. దాంతో ఆ దేశంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి ఆఫ్రికా నుంచి నమీబియా, ఉగాండా రూపంలో రెండు దేశాలు అర్హత పోటీల ద్వారా టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెడుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్-2024లో ఆడే 20 జట్లు ఇవే...


వెస్టిండీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా.
Advertisement
Advertisement
Uganda
T20 World Cup
Qualifiers
ICC

More Telugu News