Eesha Rebba: అందం .. ఆకర్షణ ఆమె సొంతం: ఈషా రెబ్బా లేటెస్ట్ పిక్స్

  • తెలుగు తెరపై తక్కువగా కనిపించే తెలుగు హీరోయిన్స్
  • కొంతవరకూ సక్సెస్ అయినవారు కొందరే 
  •  అంజలి .. స్వాతిరెడ్డి .. బిందుమాధవి ఆ జాబితాలోవారే 
  • పట్టుదలతో ముందుకు వెళుతున్న ఈషా రెబ్బా 
  • సరైన హిట్ కోసమే ఆమె వెయిటింగ్    

Eesha Rebba Special

ఒకప్పుడు తెలుగు సినిమాలలో తెలుగు ప్రాంతానికి చెందిన .. తెలుగు భాష వచ్చిన హీరోయిన్స్ మాత్రమే కనిపించేవారు. అందువలన తెలుగు కథలలో తెలుగుదనం ఉట్టిపడుతూ ఉండేది. ఆ తరువాత కాలంలో తెలుగు తెరపై తెలుగు హీరోయిన్స్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. తెలుగు తెరపై బాలీవుడ్ హీరోయిన్స్ జోరు పెరుగుతూ పోయింది. ఒక దశ తరువాత తమిళ .. మలయాళ భామల రాక ఎక్కువైంది. అక్కడి హీరోయిన్స్ ఇక్కడ చక్రం తిప్పడం మొదలైంది. ఇప్పటికీ అదే పరిస్థితి నడుస్తోంది. ఇంత పోటీ ఉన్నప్పటికీ, తెలుగు తెరపై తమ జోరు చూపించాలనే ఉద్దేశంతో తెలుగు ప్రాంతాలకి చెందిన  కొంతమంది హీరోయిన్స్ గట్టిగానే ట్రై చేస్తూ వెళ్లారు. అలాంటివారి జాబితాలో అంజలి .. స్వాతి రెడ్డి .. ఆనంది .. బిందుమాధవి కనిపిస్తారు. అయితే వీళ్లంతా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో లోనే వరంగల్ కి చెందిన ఈషా రెబ్బా కూడా గట్టి పట్టుదలతోనే ముందుకు వెళుతోంది. అవకాశాలను సంపాదించుకుంటోంది. ఫొటో షూట్ లతో తన గ్లామర్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపిస్తూనే ఉంటుంది. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం ఉన్న ఈషా రెబ్బాకి సరైన హిట్ పడితే, దశ తిరిగే అవకాశాలు ఇప్పటికీ పుష్కలంగానే ఉన్నాయనే విషయం ఈ పిక్స్ చూస్తే అర్థమైపోవడం లేదూ!

More Telugu News