Polling: ఉదయం 10 గంటల వరకు 11% పోలింగ్

  • పెద్ద సంఖ్యలో బారులు తీరిన ఓటర్లు
  • పోలింగ్ బూత్ ల వద్ద భారీగా క్యూ
  • మారుమూల ప్రాంతాల్లోనూ తరలివస్తున్న జనం
Poll percentage At 10 AM

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణలు తలెత్తినా పోలీసులు సర్దిచెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్ల రాక మొదలైంది. పది గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 11 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలను అరికట్టేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులతో భద్రత ఏర్పాటు చేసింది. జనగామలో రైల్వే స్టేషన్‌ సమీపంలోని పోలింగ్ బూత్ వద్ద ఉదయం ఉద్రిక్తత నెలకొంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలింగ్ బూత్ లో ఎక్కువసేపు ఉండడంపై కాంగ్రెస్ లోకల్ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

More Telugu News