అందువల్లనే నేను భయపడ్డాను: 'బిగ్ బాస్' రతిక

Bigg Boss 7 Update
  • ఆదివారం రోజున ఎలిమినేట్ అయిన రతిక 
  • గేమ్స్ లో తాను మొదటి నుంచి వీక్ అని వెల్లడి
  • సైలెంట్ గా ఉండటం మైనస్ అయిందని వ్యాఖ్య 
  • సెకండ్ ఛాన్స్ ను కూడా యూజ్ చేసుకోలేదన్న రతిక 

బిగ్ బాస్ హౌస్ కి ఒకసారి వెళ్లి వచ్చిన రతికకి, మరోసారి వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఈ సీజన్ లో ఈ అవకాశం ఆమె ఒక్కదానికి మాత్రమే దక్కింది. మొన్న ఆదివారం రోజున జరిగిన ఎలిమినేషన్ లో ఆమె బయటికి వచ్చేసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. 

"చిన్నప్పటి నుంచి కూడా నేను గేమ్స్ లో కాస్త వీక్. బిగ్ బాస్ హౌస్ లోను అదే జరిగింది. నేను ఫస్టు టైమ్ హౌస్ నుంచి బయటికి వెళ్లినప్పుడు, నేను చాలా బలమైన పాయింట్స్ చెబుతాను .. స్ట్రాంగ్ గా వాదిస్తాను .. అనే పేరు ఉండేది. అలా మాట్లాడటం వలన నెగెటివిటీ పెరిగిందేమో .. అందుకే బయటికి వచ్చానేమో అని నాకు అనిపించింది. అలాంటి సమయంలో నాకు రెండోసారి ఛాన్స్ వచ్చింది" అని అంది. 

"రెండోసారి హౌస్ లోకి వెళ్లాను .. అయితే ఈ సారి జాగ్రత్తగా మాట్లాడాలి .. సైలెంట్ గా ఉండాలి అని అనుకున్నాను. ఆ భయం నాలో ఉండటం వల్లనే ఈ సారి నాలో ఆ ఫోర్స్ కనిపించలేదు. బయటికి వచ్చిన తరువాత చూస్తే, నేను చేసిన తప్పు అదేనని అనిపించింది. ఏదేమైనా బిగ్ బాస్ రెండోసారి ఛాన్స్ ఇచ్చినా నేను ఉపయోగించుకోలేకపోయానని అనిపిస్తోంది" అని చెప్పింది.

Go Back to Shorts
Bigg Boss
Rathika
Yavar
Prashanth
Shivaji

More Telugu News